ఐఏఎస్‌‌ ఆఫీసర్లపై హైకోర్టు సీరియస్

ఐఏఎస్‌‌ ఆఫీసర్లపై హైకోర్టు సీరియస్
  • కోర్టు ఆర్డర్‌‌ను అమలు చేయరా?
  • స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని పీఎస్‌లకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: కోర్టు ఉత్తర్వులను అమలు చేయని ఇద్దరు ఐఏఎస్‌‌ ఆఫీసర్లపై హైకోర్టు సీరియస్ అయింది. మూడేళ్ల క్రితం ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని మండిపడింది. ఉత్తర్వులను అమలు చేయడం ఇష్టం లేకపోతే అప్పీల్‌‌ చేసుకోవాలి గానీ సైలెంట్‌గా ఉండిపోతే ఎలా? అని పంచాయతీరాజ్, రూరల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఫైనాన్స్‌‌ అండ్‌‌ ప్లానింగ్‌‌ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావును ప్రశ్నించింది. 2018 మార్చి 15న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో ఈనెల 26న స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ధిక్కార కేసులో ప్రతీ వాయిదాకు రావాల్సిందేనని జస్టిస్‌‌ రామచంద్రరావు నోటీసులిచ్చారు.  కరీంనగర్‌‌ జిల్లాలోని జడ్పీ స్కూల్స్‌‌లో స్వీపర్‌‌గా పనిచేసే ఎండీ కాశీం మరో 45 మందికి రూ.13వేల వేతనాలివ్వాలని 2018 మార్చి 15న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.